చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి
సర్పంచ్ చూనర్కర్ సతీష్
వాంకిడి,(విజయ క్రాంతి): అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని వాంకిడి సర్పంచ్ చునార్కర్ సతీష్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రాన్ని వార్డు సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల, విద్యార్థుల ఆధర్ రిజిస్టర్ పరిశీలించారు. చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం తదితర అంశాలపై అంగన్వాడి టీచర్ను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులతోపాటు గర్విణులు, బాలింతలకు కోడిగుడ్లతోపాటు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి సూచించారు. గర్భిణులు తప్పనిసరిగా అంగన్వాడి కేంద్రాల్లో ఇస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సర్పంచ్ వెంట వార్డు మెంబర్లు, అంగన్వాడీ టీచర్ ఉన్నారు.




