16 March, 2026 | 5:49 PM

తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి కమిటీ

16-03-2026 03:29 PM

మంథని,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కొరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించేందుకు కాంగ్రెస్ పార్టీ కమిటీ వేసేందుకు ముందుకు వచ్చిందనంకు హర్షనీయమని, ఉద్యమకారులను గుర్తించి అందరికీ 250 గజాల ఇంటి స్థలం, రూ.25,000 వేల పెన్షన్, హెల్త్ కార్డ్స్, ఉద్యమకారుడి ఐడి కార్డు ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మంథని డివిజన్ కన్వీనర్ గోగుల రాజిరెడ్డి, తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకుడు బెజ్జంకి డిగంబర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.

మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ లో వారు సోమవారం మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రాష్ట్ర ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మంత్రి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్న దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలంతో పాటు వారికి పెన్షన్ ఇస్తామని పెట్టడం జరిగిందని, దీన్ని స్వాగతిస్తూ మరి కమిటీ కూడా ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు.  అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వారందరినీ గుర్తించాలని కోరుతున్నాం.

కేవలం జైలుకు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదైన వాళ్ళనే కాకుండా పోరాటం చేసిన విద్యార్థి నాయకులను మరియు ఉద్యమకారులను అందరినీ కూడా పరిగణలోకి కమిటీ తీసుకోవాలని వారందరికీ కూడా ఉద్యమ ఫలాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. కమిటీ వేయడానికి ముందుకు వచ్చిన రాష్ట్ర ఐటి, ఇండస్ట్రీస్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు పొన్నం ప్రభాకర్ కు  అద్దంకి దయాకర్ కు  కేశవరావు కు సీమ శ్రీనివాస్ కు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నమని అన్నారు.