18 July, 2026 | 12:17 PM

Breaking News

విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •   సోనమ్ వాంగ్‎చుక్ దీక్ష భగ్నం.. ఆసుపత్రికి తరలింపు   •  

రాజ్యసభలో ఎంపీగా ఆర్ కృష్ణయ్య ప్రమాణ స్వీకారం

16-12-2024 11:46 AM

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన ముగ్గురు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు బీద మస్తాన్‌ రావు, ఆర్‌.కృష్ణయ్య, సానా సతీష్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ నుంచి ఈనెల 13న రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో బీసీ హక్కుల కోసం పోరాడిన ఆర్ కృష్ణయ్య బీజేపీ నుంచి రాజ్యసభకు వెళ్లారు. 2014 లో టీడీటీ తరుపున ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గా గెలిచారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2022లో వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లారు. ఈ ఏడాది సెప్టెంబర్ 24న రాజ్యసభకు, వైసీపీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆర్ కృష్ణయ్య బీజేపీ నుంచి పెద్దల సభకు వెళ్లారు. నెల్లూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బీద మస్తాన్ రావు టీడీపీ నంచి రాజ్యసభకు వెళ్లారు. సానా సతీష్ టీడీపీ నుంచి పెద్దల సభలో నేడు ప్రమాణస్వీకారం చేశారు.