18 July, 2026 | 12:34 PM

Breaking News

Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •  

ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

16-12-2024 10:26 AM

బలోద్: ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో, రాంగ్ సైడ్ నుండి వస్తున్న ట్రక్కు కారును ఢీకొనడంతో ఆరుగురు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. దొండి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని భానుప్రతాప్‌పూర్‌-దల్లిరాజహార రహదారిపై చౌరపవాడ్‌ సమీపంలో తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. సమాచారం మేరకు ఎదురుగా వస్తున్న ఎస్‌యూవీ కారును ట్రక్కు ఢీకొట్టింది. క్షతగాత్రులను రాజ్‌నంద్‌గావ్ మెడికల్ కాలేజీకి తరలించారు.

ప్రమాదం గురించి వివరాలను అందజేస్తూ, అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్ఫీ) అశోక్ జోషి మాట్లాడుతూ, నిందితుడు ట్రక్ డ్రైవర్ సంఘటనా స్థలం నుండి పారిపోయాడని అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. స్థానికుల సాయంతో గంటల తరబడి శ్రమించి కారులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. సమాచారం ప్రకారం, కారులోని వ్యక్తులు దుండిలోని కుంభాకర్‌లో బంధువుల ఇంట్లో ఛత్తీ కార్యక్రమానికి హాజరై తిరిగి స్వగ్రామం గురేడకు వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.