1 June, 2026 | 8:59 PM

జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో ‘రేస్’ విజయభేరి

01-06-2026 08:29 PM

కోదాడ: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ‘రేస్ ఐఐటి అకాడమీ’ విద్యార్థులు జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి విజయభేరి మోగించినట్లు చైర్మన్ బాణాల వసంత వెంకటరెడ్డి సోమవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ కళాశాల విద్యార్థులు ఎల్.శశిరేఖ–1196, కర్ణ కార్తికేయరాజ్–1539, ఎం.చరణ్ సాయి గౌడ్–3581, పి.చాముండేశ్వరి–3809, సిహెచ్ భాను శంకర్–4539, ఐ.కృష్ణ చరణ్–5961, ఎం.సంజయ్ సిద్ధార్థ–7224, డి.విజయ్ చరణ్–11107 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించినట్లు తెలిపారు.

అధ్యాపకుల అత్యుత్తమ శిక్షణ, నిరంతర మాక్ టెస్టులు, విద్యార్థుల కృషి కలిసివచ్చి ఈ విజయాన్ని సాధ్యంచేశాయని పేర్కొన్నారు.జేఈఈ మెయిన్స్ తరహాలోనే అడ్వాన్స్డ్‌లోనూ తమ విద్యార్థులు ప్రభంజనం సృష్టించడం గర్వకారణమని తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.