ఆశను తట్టిలేపే కవితలు ‘రఘుశ్రీ హైకూలు’
అంతర్జాతీయ సాహిత్య రంగంలో హైకూ ప్రక్రియకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. జపాన్ నుంచి వచ్చిన ఈ ప్రక్రియను తెలుగు పాఠకులకు మరింత దగ్గర చేసేందుకు ఎంతోమంది కవులు కృషి చేశారు. ఇదే కోవలో కవి రఘుశ్రీ కూడా తన వంతు పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన ‘రఘుశ్రీ హైకూలు’ పేరుతో ఒక కవితల సంకలనం వెలువరించారు. రఘుశ్రీ అసలు పేరు ఉమ్మడిశింగు రాఘవరావు. ఈయన ఇప్పటికే అర్ధశతకం, వెలుగు రెక్కలు, శ్రీపరార్ణవం, అర్ధార్థ చంద్రికలు, కవీంద్ర మోక్షం అన్న కవితా సంపుటాలు వెలువరించారు.
చిలక్కొరికిన అక్షరాలు, శ్రీమతికి ప్రేమతో, మారేడు దళాలు పేరిట హైకూల సంకలనాలను ముద్రించారు. ఆ కవిత ల సంకలనాలన్నీ బహుళ ప్రాచుర్యం పొందాయి. వాటిలో ‘రఘుశ్రీ హైకూలు’ ప్రత్యేకమైన సంపుటి. పుస్తకంలోని ఒక్కో కవిత మూడు లైన్లలో చదువగానే ఆకర్షించే విధంగా ఉంది. కవి ప్రతి కవితలోనూ ఒక జీవిత సత్యాన్ని చాటిచెప్పారు. సమాజంలోని రుగ్మతలను, ప్రకృతి అందాలను తన కలం ద్వారా ఎండగట్టారు.
చాలా సరళమైన పదాలతో లోతైన అంతరంగాన్ని ఆవిష్కరించారు. పుస్తకంలోని కవితలు క్లుప్తతకు, గాఢతకు చక్కటి నిదర్శనాలు. కవి ‘పొద్దుపోయింది, వెలిగిన దీపా లు, నిశికి ఉరి’ అని రాశారు. చీకటిని చీల్చుకుం టూ వచ్చే కాంతి రేఖలను ఈ కవిత ప్రతిబింబిస్తుంది. మానవ జీవితంలో కష్టాలు తొలగి సుఖా లు వచ్చే క్షణాలను ఇది గుర్తుచేస్తుంది. ‘శ్వాసతో స్నేహం, కడదాకా వెన్నంటి, ఆత్మవిశ్వాసం’ అంటూ ఓ కవితలో మానవ సంబంధాల లోతులను స్పృశించారు.
మనిషికి అన్నిటికంటే ముఖ్యమైనది తనపై తనకు నమ్మకమేనని కవి తన రచ నా పటిమ ద్వారా చాటిచెప్పారు. శ్వాస ఉన్నంత వరకు మనల్ని నడిపించేది ఆత్మవిశ్వాసమేనని ఈ మూడు లైన్ల కవిత నిరూపిస్తుంది. గుండెల్లో ధైర్యాన్ని నింపేలా భావధార సాగింది. ప్రకృతిని సామాజిక అంశాలతో ముడిపెట్టడంలో కవి ప్రతి భ అమోఘం. ‘పిల్ల కాలువ, కాగితం పడవలు, భావం వరద’ అనే కవిత ప్రతిఒక్కరిలోని బాల్య స్మృతులను మేల్కొల్పుతుంది.
చిన్ననాటి ఆటల ను గుర్తు చేస్తూనే కవిత్వంలో ఉప్పొంగే భావాల ను కవి మన కళ్లకు కట్టారు. చిన్నపిల్లల ఆలోచనల సరళిలా కవిత్వం కూడా స్వచ్ఛంగా సాగాల నే సంకేతాన్ని ఇచ్చారు.సమాజంలో పెరిగిపోతు న్న కపటత్వాన్ని కూడా ఆయన వదిలిపెట్టలేదు.
మనుషుల్లోని కపటత్వాన్ని ఎండగట్టిన కవి
‘కపట ప్రేమ, నీ సొంత గుణం కాదు, నీకంటుకుంది’ అంటూ నేటి సమాజ తీరును కవి విమర్శించారు. మనుషుల్లోని కరుడుగట్టిన స్వార్థాన్ని ఎండగట్టారు. పుట్టుకతో ఎవరూ కపటులు కారని, చుట్టూ ఉన్న వాతావరణమే మనుషులను మారుస్తుందని కవి హితవు పలికారు. ‘వంచనాయుధం, బంగారు వన్నెలతో, బహు పదును’ అంటూ మోసగాళ్ల నైజాన్ని బయటపెట్టారు.
పైకి ఎంతో ఆకర్షణీయంగా కనిపించే మోసాలు లోపల ఎంత ప్రమాదకరంగా ఉం టాయో కవి ఈ మూడు లైన్లలో వివరించారు. మనుషుల మాటల వెనుక, ఆకర్షణల వెనుక దాగి ఉండే కపటత్వాన్ని గ్రహించాలని పద్య పాదాలు హెచ్చరిస్తాయి. సమాజంలో బతికేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ కవిత బోధిస్తుంది. మతం పేరిట జరిగే వర్ఖత్వాన్ని కవి తీవ్రంగా నిరసించారు.
సామాజిక మూఢ్యాలపై అస్త్రాలు
‘మత మౌఢ్యాలు, నూతిలో మండూకాల, బెకబెకలు’ అంటూ సకుంచిత మనస్తత్వాలను ఎండగట్టారు. బాహ్య ప్రపంచాన్ని చూడకుండా కేవలం తమ మతమే గొప్పదనుకునే వారిని బావిలో కప్పలతో పోల్చారు. ఈ వివక్ష సమాజ ఎదుగుదలకు ఎంత పెద్ద అడ్డంకో కవిత తెలియజేస్తుంది. మనుషుల మధ్య గోడలు కట్టే మూర్ఖత్వాన్ని వీడాలని కవి పిలుపునిచ్చారు. చివరిగా ఒక తాత్విక సత్యాన్ని కవి మన ముందు ఉంచారు.
‘జగతి మిథ్య, నింగి ఇంద్రచాపంలా, ద్వైతాద్వైతంలా’ అంటూ కవి విశ్వసత్యాన్ని పలికారు. ఈ సృష్టిలోని ప్రతిదీ తాత్కాలికమేనని, ఆకాశంలోని ఇంద్రధనస్సు లాంటిదేనని గుర్తుచేశారు. సుఖదుఃఖాలు, భేద భావాలు అన్నీ క్షణికమేనని కవి త బోధిస్తుంది.
చిన్న చిన్న వాక్యాలతోనే ఇంతటి లోతైన విశ్లేషణ అందించిన ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ చదవదగిన కావ్యం. చిన్నవాక్యాలతోనే ఎంతో లోతైన అర్థాన్ని ఇవ్వడం ఈ హైకూల ప్రత్యేకత. సమాజంలోని ప్రతి కోణాన్ని రఘుశ్రీ టచ్ చేశారు. చదువరులను ఆలోచింపజేసే లాం టి భావాలు ఇందులో ఎన్నో ఉన్నాయి. హైకూ ప్రేమికులకు ఈ రచన ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. ప్రతి ఒక్కరూ దాచుకోదగి పుస్తకమిది.
రాధిక






