27 June, 2026 | 11:29 AM

కొత్త చిరునామాకు రాహుల్ గాంధీ!

20-06-2025 01:04 AM

న్యూఢిల్లీ, జూన్ 19: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ త్వరలోనే కొత్త చిరునామాకు మారనున్నట్టు తెలుస్తోం ది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పనులు మొదలయినట్లు సమాచారం. సున్‌హారీ బాగ్ రోడ్డులోని బంగ్లా నం బర్ 5కి ఆయన మారనున్నారట. జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందే రాహుల్ ఈ కొత్త బంగ్లాలోకి మారతారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికవడంతో టైప్ 8 బంగ్లాకు అర్హులయ్యారు. గతంలో ఈ బంగ్లాలో కర్ణాటకకు చెందిన బీజేపీ నేత నారాయణస్వామి ఉండేవారు. ప్రస్తుతం రాహుల్‌గాంధీ ఆయన తల్లి సోనియా గాంధీతో కలిసి 10 జన్‌పథ్‌లో నివాసం ఉంటున్నారు.