17 April, 2026 | 10:58 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

పేలిపోయిన స్పేస్ ఎక్స్ స్టార్ షిప్

20-06-2025 12:39 AM

ఎవరికీ గాయాలు కాలేదన్న అధికారులు

టెక్సాస్, జూన్ 19: స్పేస్ ఎక్స్‌కు చెందిన పదో స్టార్ షిప్ ఫైర్ టెస్టు సమయంలో పేలిపోయింది. స్పేస్ ఎక్స్ టెస్టింగ్ సైట్ మాన్సేలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఫైర్ టెస్టుకు సెకండ్ల ముందే స్టార్ షిప్ పేలిపోవడం గమనార్హం. ప్రయోగ వేదికపై ఉన్న స్టార్ షిప్ ఒక్కసారిగా పేలిపోవడంతో దాని శకలాలు గాల్లోకి ఎగిసిపడ్డాయి.

అయితే ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు ప్రకటించారు. అంతరిక్షంపై పట్టు సాధిద్దామని అనుకుంటున్న మస్క్ కంపెనీకి ఇటీవల వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. స్పేస్ ఎక్స్ కంపెనీ స్టార్ షిప్స్ వరుసగా విఫలం అవుతున్నాయి.

స్టార్ షిప్ పేలిపోయిన ఘటనను కంపెనీ ప్రతినిధులతో పాటు స్థానిక అధికారులు కూడా ధృవీకరించారు. స్థానిక అధికారులతో కలిసి ఈ ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు స్పేస్‌ఎక్స్ ప్రకటించింది. స్టార్ షిప్ ప్రయోగం ఇప్పటికే మూడు సార్లు విఫలం అయింది.