7 September, 2026 | 10:01 AM

తెలంగాణలో వర్ష సూచన.. 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

07-09-2026 | 08:40am

హైదరాబాద్: తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ(Meteorological Department) అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ సహా 6 జిల్లాలకు ఆరెంజ్(Orange) అలర్ట్ ప్రకటించగా, మరో 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మరిన్ని వార్తలు