వానకాలం.. జాగ్రత్తలు!
వాతావరణం మారుతోంది.. వర్షాలు ప్రారంభమయ్యా.. సీజనల్ వ్యాధులు ప్రబలే ఈ కాలంలో పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. జ్వరం, శ్వాసకోశ, ఫంగల్, పొత్తి కడుపు ఇన్ఫెక్షన్లతో పిల్లలు ఈ కాలంలో చాలా ఇబ్బంది పడతారు. ఈ సమయంలో పిల్లల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలు బయటికి వెళ్లేటప్పుడు, స్కూల్‌కు వెళ్తుంటే గొడుగులు, రెయిన్‌కోట్‌లు, రెయిన్‌బూట్‌లను ఉపయోగించాలి. ఇవి పిల్లల ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతాయి.
వర్షాకాలంలో రోజూ కురుస్తున్న వర్షం వల్ల చలి వాతావరణం ఏర్పడుతుంది. పిల్లలు వెచ్చగా ఉండాలంటే వీలైనంత వరకు కాటన్ దుస్తులు, జాకెట్లు వేసుకునే విధంగా చూసుకోండి. ఈ సీజన్‌లో దోమ కాటు చాలా ప్రమాదకరం. కాబట్టి దోమతెరలను ఉపయోగించడం చాలా మంచిది. ఇంటి చుట్టూ ఎక్కడా నీరు నిలువకుండా చూసుకోవాలి. వర్షాకాలంలో ఫ్లూ, జలుబు, తుమ్ములు ఇతర లక్షణాలు సాధారణం. రెండు లేదా మూడు రోజులైన తగ్గాకుంటే వైద్యులను సంప్రదించాలి.






