20 August, 2026 | 2:10 PM

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు

20-08-2026 01:38 PM

తాండూరు, ఆగస్టు 20, (విజయ క్రాంతి): మాజీ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా గురువారం వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం రాజీవ్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి మాట్లాడుతూ సాంకేతిక రంగం, దేశం ఆధునీకరణ కోసం రాజీవ్ గాంధీ అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, టౌన్ ప్రెసిడెంట్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.