వికసించని రాజీవ్ యువ వికాసం
- దరఖాస్తు చేసుకుని ఏండ్లు గడుస్తున్న వైనం
- నేటికీ గ్రౌండింగ్ కాని యూనిట్లు
- అయోమయ స్థితిలో నిరుద్యోగ యువత
పాలకవీడు, సెప్టెంబర్ 16 : ప్రభుత్వాలు దేశానికి యువతే పెట్టుబడి అని ఆ యువత సన్మార్గంలో నడిచి దేశాభివృద్దిలో భాగం కావాలని ప్రతి వేదికపై నుండి ప్రవచనాలు ప్రవచిస్తూ ఉంటాయి. కానీ ఆ దిశగా యువతను నడిపించడంలో విఫలం అవుతన్నారనే చర్చ సమాజంలో నిరంతరం జరుగుతూనే ఉన్నది. ఏ నినాదంతో తెలంగాణ వాదాన్ని(Telangana cause) బలంగా వినిపించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామో అందులో ముఖ్యమైనది మన ఉద్యోగాలు(Jobs) మనకే దక్కాలే అన్నది నేటికీ నెరవేరలేదనేధి పలువురి నోట వినిపిస్తున్న మాట.
గత పది సంవత్సరాల బీఆర్‌ఎస్ పాలన(BRS Rule) చూసినా ఈ రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో(Congress rule) అయినా యువత ఆటు ఉద్యోగాల నోటిఫికేషన్లు(Job Notifications) లేక ఇటు స్వయం ఉపాధి పథకాలు(Employment Schemes) లభించక అయోమయ స్థితిలో పడ్డారనే విషయాలు బయట వినిపిస్తున్నాయి. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో యువతకు నిరుద్యోగ బృతి కల్పిస్తామని ఎన్నికల హామీ ఇచ్చినా అది కల్పంచలేకపోగా ఒక్క స్వయం ఉపాధి పథకం అందించిన పాపాన పోలేదనీ యువతి ప్రత్యక్షంగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ప్రస్తుత ప్రభుత్వం కూడా యువతకు తగిన అవకాశాలు కల్పించడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మంజూరీ కానీ రాజీవ్ యువ వికాసం యూనిట్
రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం దరఖాస్తు చేసుకుని పదహారు మాసాలు గడిచినా ఇప్పటి వరకు ఒకటంటే ఒక్క యూనిట్ ను కూడా మంజూరి చేయలేదు. దీంతో యువత నైరాశ్యంలో ఉన్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నికల్లో ఈ పార్టీకి మద్దతు తెలిపి ప్రభుత్వంలోకి తీసుకువస్తే యువత జీవితాలు బాగుపడుతాయని ఆశిస్తే చివరకు నిరాశే మిగిలిందని యువత వాపోతున్నారు.
నేటికీ గ్రౌండింగ్ కాని యూనిట్లు
రాజీవ్ యువవికాసం పథకానికి దరఖాస్తు చేసుకుని పదహారు మాసాలు పూర్తున ఇప్పటి వరకు ఒక్క యూనిట్ గ్రౌండింగ్ కాలేదు. కేవలం యువతను మభ్యపెట్టడానికే యువ వికాసం పేరుతో దరఖాస్తులను స్వీకరించారు తప్ప పాలకులు చిత్తశుద్దితో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా లేరనేది స్పష్టంగా తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి స్వయం ఉపాధి పథకాలు అందించి నిరుద్యోగ యువతును ఆదుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు
అర్హులైన యువకులకు వెంటనే చెక్కులు అందించాలి
రాజీవ్ యువ వి కాసం పథకం పూర్తి గా ఆటకెక్కింది. రేపే చెక్కులు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు వాటి ఊసే లేదు. ప్ర భుత్వం యువతకు తీరని అన్యాయం చే స్తోంది. ఎన్నికల సమయంలో యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని వారి మేనిఫెస్టో లో పెట్టుకున్నప్పటికీ ఇప్పటివరకు అమలు చేయలేదు. యువతకు కొత్త ఉద్యోగాలు కల్పిస్తామన్నారు అది కూడా లేదు. ఈ ప్ర భుత్వం ఇప్పటికైనా అర్హులైన వారికి ప్రభు త్వం వెంటనే చెక్కులను అందించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.
పి.సతీష్, యల్లాపురం