19-02-2026 12:24:20 AM
ఎర్రుపాలెం, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): కేంద్ర మాజీ మంత్రి ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి నిధుల నుండి మధిర ,ఎర్రుపాలెం మండలానికి రూ 40 లక్షల రూపాయలు ఎంపీ ల్యాండ్స్ నిధులు మంజూరైనట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జవ్వాజి ఆనందరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేణుక చౌదరి గారు కేంద్ర మంత్రిగా ఉన్న సందర్భంలో ఖమ్మం జిల్లా అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని గిరిజన బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని మధిర ప్రాంత అభివృద్ధికి ఎన్నో నిధులు వారు సొంతంగా కేటాయించారని తెలిపారు. మధిర ఎర్రుపాలెం మండలాలకు 40 లక్షల రూపాయలు ఎంపీ ల్యాండ్స్ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
ఎర్రుపాలెం మండలంలో.
మీనవోలు గ్రామంలో సిసి రోడ్లకు 5 లక్షల రూపాయలు.
ఇనగాలి గ్రామానికి సిసి రోడ్లకు 5 లక్షల రూపాయలు .
రేమిడిచర్ల గ్రామానికి బీసీ రోడ్లకు 5 లక్షల రూపాయలు మంజూరు చేశారు.
మధిర మండలంలో..
దెందుకూరు సిసి రోడ్లకు 4 లక్షల రూపాయలు
నిదానపురం సిసి రోడ్లకు 4 లక్షల రూపాయలు
రొంపి మల్ల సైడ్ డ్రైన్స్ కి 4 లక్షల రూపాయలు
దేశాన్ని పాలెం గ్రావిల్ రోడ్డుకు 4 లక్షల రూపాయలు.
జిలుగుమాడు సిసిరోడ్లకు రూ. 4 లక్షలు..
ఇల్లూరులో ఎల్‌ఈడి లైట్స్ కు 4 లక్షల రూపాయలు మంజూరు చేశారు.
కేంద్ర మాజీ మంత్రి రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి మధిర ప్రాంతంపై ఉన్న ప్రేమతో వారి ఎంపీ ల్యాండ్స్ నిధుల నుండి మంజూరు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జవ్వాజి ఆనందరావు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు.