3 March, 2026 | 1:35 AM

రాజ్యసభ సీటు మాదిగలకు కేటాయించాలి

03-03-2026 12:00 AM

ఎంఎస్‌పీ జాతీయ నేత మంద కుమార్ మాదిగ 

హనుమకొండ టౌన్, మార్చి 2 (విజయక్రాంతి): రాజ్యసభ సీటును మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో  ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంఎస్పి జాతీయ నేత మంద కుమార్ మాదిగ పాల్గొని, మాట్లాడుతూ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగల ఎమ్మెల్యే స్థానాలు తగ్గించి మాలలకు కేటాయించడం, అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో మూడు పార్లమెంటు స్థానాలు ఉంటే ఒకటి కూడా మాదిగలకు  కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ మాదిగ జాతికి తీరని అన్యాయం చేసిందన్నారు. ఇప్పటికైనా రాజ్యసభ సీటును మాదిగల కేటాయించాలని అన్నారు. నామినేట్ పదవులల్లో మాదిగలకు అవకాశం ఇవ్వాలని గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైన మాదిగ జాతిని మోసం చేయకుండా, రాజ్యసభ సీట్లు తక్షణమే కేటాయించాలి డిమాండ్ చేశారు. లేని పక్షంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పోరాటానికి సిద్ధపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్పి జాతీయ నాయకులు వేల్పుల సూరన్న కాపు, ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి బొర్ర బిక్షపతి మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జన్ను దినేష్ మాదిగ, ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు బండారి సురేందర్ మాదిగ, ఎమ్మెస్పి రాష్ట్ర నాయకులు  మంద రాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి సుంచు రజిని కుమార్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.