calender_icon.png 9 December, 2025 | 7:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతి అధికారుల కన్నా అడుక్కునే బిచ్చగాడు మిన్న

09-12-2025 06:06:51 PM

తెలంగాణ తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కొంగర ప్రభాకర్..

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ చౌరస్తాలో తెలంగాణ తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కొంగర ప్రభాకర్ ఆధ్వర్యంలో మంగళవారం ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులు అవినీతిలో కూరుకుపోయి ప్రజల సొమ్మును దోచుకొని, దాచుకోవడాన్ని నిరసిస్తూ లోక్ సత్తా, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ ల వంటి స్వచంద సంస్థలతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి, వరంగల్ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ కొంగర ప్రభాకర్ మాట్లాడుతూ ఇటీవల ఏసీబీ అధికారులు జాయింట్ కలెక్టర్, డీఈవోగా ఇంచార్జ్ పనిచేస్తున్న వెంకట రెడ్డిని అరెస్ట్ చెయ్యడం అభినందించతగిన విషయం అని ఏసీబీ అధికారులను కొనియాడారు.

ఇలాంటి అవినీతి తిమింగలాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా మంది ఉన్నారని వీళ్ళందరినీ ఏసీబీ అధికారులు పకడ్బందీగా పట్టుకొని ప్రజల సొమ్మును ప్రభుత్వానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలాంటి  కార్యక్రమాలకు తెలుగు యువత ఉమ్మడి వరంగల్ జిల్లా తరపునా ఏసీబీ అధికారులకు సహకరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో లోక్ సత్తా, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.