calender_icon.png 9 December, 2025 | 7:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మానవ హక్కుల దినోత్సవం

09-12-2025 06:03:32 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ మానవ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్, కార్యక్రమానికి కెరమెరి ఎస్సై నాయిని మధుకర్ ఎంపిపిఎస్ సుల్తాన్ గుడ, ఎంపిపిఎస్ బోరిలాల్ గూడా, TWPS శంకర్ గుడ, TWPS అందుగూడ, ఎంపిపిఎస్ కరంజివాడ ప్రభుత్వ పాఠశాలల 150 మంది విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్, షార్ప్నార్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బాలుల హక్కుల గురించి, మానవ హక్కుల గురించి, ప్రాథమిక హక్కుల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల కమిటీ కేరమేరి మండల చైర్మన్ జాదవ్ రమేష్, వైస్ చైర్మన్ బోడికే రవి, ప్రభుత్వ ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.