14 May, 2026 | 3:26 AM

ఎగ్జిబిటర్లు అడిగినంత పర్సంటేజీ ఇవ్వలేం

14-05-2026 02:15 AM

నిర్మాత సూర్యదేవర నాగవంశీ

థియేటర్ల యజమానులు డిమాండ్ చేస్తు న్న పర్సెంటేజ్ విధానాన్ని ప్రస్తుతానికి అంగీకరించలేమని ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం ఇతర నిర్మాతలతో కలిసి హైదరాబాద్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎగ్జిబిటర్లు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని బెదిరించినట్లు మాట్లాడ టం సరికాదని ఆయన హితవు పలికారు. ప్రస్తుతం 25కు పైగా సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

ఇప్పటికే ఆ సినిమాలపై 80 శాతం బడ్జెట్ ఖర్చు చేశామని తెలిపారు. ఇలాంటి సమయంలో కొత్త విధానం తీసుకురావడం సా ధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు. భవిష్యత్తులో తీయబోయే సినిమాల గురించి కావా లంటే చర్చించుకోవచ్చని సూచించారు. థియేటర్ల గ్రేడింగ్, నిర్వహణ ఖర్చులు, ఆన్ లైన్ టికెట్ చార్జీల వంటి అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాతే కొత్త విధానంపై ఆలోచిస్తామని నాగవంశీ పేర్కొన్నారు. నిర్మాత యలమంచిలి రవిశంకర్ మాట్లాడుతూ ఎగ్జిబిటర్ల సమస్యలను తాము కాదనడం లేదని తెలిపారు.

అయితే డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నా రని ఆయన వివరించారు. కేవలం తమ ప్ర యోజనాలే ముఖ్యమని ఎగ్జిబిటర్లు అనుకోవడం సరైన పద్ధతి కాదని ఆయన అభి ప్రాయపడ్డారు. అందరం కూర్చుని మాట్లాడుకుంటేనే సమస్యలు పరిష్కారం అవు తాయని ఆయన చెప్పారు.

‘హరి హర వీరమల్లు’ వంటి పెద్ద సినిమా వస్తున్న సమ యంలో ఇలాంటి వివాదాలు సష్టించడం సరికాదని ఆయన అన్నారు.  పరిశ్రమలోని వడు విభాగాలు కలిసికట్టుగా ఉంటేనే అందరికీ మనుగడ ఉంటుందని ఆయన పేర్కొ న్నారు. నిర్మాత సాహు గారపాటి మా ట్లాడుతూ.. పర్సంటేజీ విషయంలో ఎగ్జిబిట ర్ల తీరు సరిగా లేదని అసహనం వ్యక్తం చేశారు.