నాలాపై నిర్మాణం.. నిబంధనలు నీటిపాలు
- అధికారుల మౌనం వెనుక మతలబేంటి?
- ఇంజాపూర్ ఆపిల్ అవెన్యూలో జోరుగా అక్రమ నిర్మాణాలు
- ఇరిగేషన్ నోటీసులనూ తుంగలో తొక్కిన భవన యజమాని
- మాసబ్ చెరువు నీటి ప్రవాహానికి తీవ్ర విఘాతం
- వర్షం వస్తే ముంపు భయంలో స్థానికులు..
- స్పందించని జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్ అధికారులు
ఆదిభట్ల, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): రాజధాని నగరంలో చెరువులు, నాలాల సంరక్షణ కోసం ప్రభుత్వం ’హైడ్రా’ పేరిట కఠిన చర్యలకు శ్రీకారం చుట్టినప్పటికీ, క్షేత్రస్థాయి అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఆదిభట్ల మున్సిపాలిటీ(Adibatla Municipality) సర్కిల్ పరిధిలోని ఇంజాపూర్ ఆపిల్ ఎవెన్యూ కాలనీ()Apple Avenue Colonyలో నాలా నిబంధనలను బహిరంగంగానే ఉల్లంఘిస్తూ భవన నిర్మాణం చేపడుతుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. నాలా పక్కనే, ఎలాంటి సెట్బ్యాక్స్ వదలకుండా నిబంధనలకు విరుద్ధంగా పను లు సాగుతున్నా సంబంధిత టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నోటీసులు కాగితాలకే పరిమితం...
చారిత్రక మాసబ్ చెరువు నుంచి రాచకాలువ మీదుగా బాతుల చెరువుకు ప్రవహించే ప్రధాన నాలాను ఆనుకుని ఈ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ అక్రమ నిర్మాణంపై ఇరిగేషన్ అధికారులు ప్రాథమికంగా పరిశీలించి భవన యజమానికి నోటీసులు జారీ చేశారు. అయితే, ఆ నోటీసులను సద రు యజమాని ఏమాత్రం లెక్కచేయకుండా నిర్మాణాన్ని ముమ్మరం చేశారు.
నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప, పనులను క్షేత్రస్థాయిలో అడ్డుకోవడంలో ఇరిగేషన్ మరియు జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లా నింగ్ అధి కారు లు ఘోరంగా విఫలమయ్యారని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. అధికారుల మామూళ్ల మౌనమే ఈ అక్రమ నిర్మాణానికి ఊపిరి పోస్తోందని స్థానికులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
భవిష్యత్తులో తీవ్ర ముంపు ముప్పు....
సాధారణంగా నాలా ప్రవాహానికి ఇరువైపులా నిబంధనల ప్రకారం నిర్దిష్ట విస్తీర్ణంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ ఇక్కడ నాలా సరిహద్దులను కబ్జా చేస్తూ నిర్మాణాలు సాగుతుండటంతో వర్షాకాలంలో నీటి ప్రవాహానికి తీవ్ర అడ్డంకులు ఏ ర్పడే ప్రమాదం ఉంది. కొద్దిపాటి వర్షానికే ఇంజాపూర్, ఆపిల్ అవెన్యూ పరిసర ప్రాం తాలు జలమయం అయ్యే అవకాశం ఉంద ని, కాలనీలు ముంపునకు గురైతే తమ పరిస్థితి ఏంటని ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
టౌన్ ప్లానింగ్ అనుమతి ఎలా ఇచ్చింది?
నాలా పరిధిలో నిర్మాణాలు చేపట్టాలం టే ఇరిగేషన్ శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తప్పనిసరి. అసలు ఈ నిర్మాణానికి నీటి పారుదల శాఖ నుంచి ఎన్‌ఓసీ ఉందా? టౌ న్ ప్లానింగ్ అధికారులు అనుమతులు ఇ చ్చారా? లేదా అనుమతులు లేకుండానే ప నులు జరుగుతున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ అనుమతులు లేకపో తే అధికారులు తక్షణమే నిర్మాణాన్ని ఎందు కు కూల్చివేయడం లేదని స్థానికులు నిలదీస్తున్నారు.
‘హైడ్రా’ జోక్యం చేసుకోవాలని డిమాండ్....
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇంజాపూర్ నాలా పరిధిలో సమగ్ర సర్వే నిర్వహించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను తక్షణమే నేలమట్టం చేసి, బాధ్యులైన భవన యజమానితో పాటు సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఈ వ్యవహారాన్ని ’హైడ్రా’ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరిస్తున్నారు.