31 March, 2026 | 2:11 PM

Breaking News

వెలుగులోకి కల్తీ అల్లం పేస్ట్ వ్యవహారం... హైదరాబాద్‌లో వ్యాపారి అరెస్టు   •   చైత్ర మాసం చివరి రోజున ఆలయంలో తొక్కిసలాట: 8 మంది మృతి   •   గురుకుల విద్యను సద్వినియోగం చేసుకోవాలి   •   ఈదురు గాలులకు నేలకొరిగిన వరి, జొన్న పంట   •   మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం — రైతుల నుంచి విశేష స్పందన   •   హైదరాబాద్‌లో జయలలిత ఇంటికి సీల్   •   ఆకాల వర్షాలకు పంటలు ఆగం.. తీవ్ర ఆందోళ‌న‌లో నిజామాబాద్ రైతులు   •   బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు   •   పట్టాలు తప్పిన గూడ్స్.. ట్రాక్‌పై అడ్డంగా పడిన పాల ట్యాంకర్   •   ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం   •  

ఏకగ్రీవంగా సర్పంచ్ ను ఎన్నుకున్న రంగంపేట గ్రామస్తులు

29-11-2025 07:10 PM

గజ్వేల్: గజ్వేల్ మండలం రంగంపేట గ్రామస్తులు సర్పంచ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్ నామినేషన్లకు చివరి రోజు అయిన శనివారం రంగంపేట గ్రామ సర్పంచ్ పదవికి గ్రామానికి చెందిన నడిగోప్పుల నాగరాజు మాత్రమే రెండు సెట్ల నామినేషన్ వేశారు. దీంతో రంగంపేట గ్రామానికి నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అయింది. గ్రామస్తులంతా తమ గ్రామాభివృద్ధి కోసం ఒకే తాటిపైకి వచ్చి నాగరాజును సర్పంచ్ గా ఎన్నుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. గతంలో మాజీ సర్పంచ్ నడిగప్పుల నరసమ్మ గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేసిందని ఆమె హయాంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, అదే నమ్మకంతో ఆమె కుమారుడు నాగరాజును గ్రామస్తులమంతా ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అందుకే గ్రామం నుండి ఆయన ఒకరి చేతనే నామినేషన్ వేయించినట్లు తెలిపారు.