calender_icon.png 15 January, 2026 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగవల్లులు ఆడబిడ్డల కళారూపాలు

15-01-2026 12:58:23 AM

- పోటీలో గెలుపు ఓటములు సహజం

- ఎంఎల్‌ఏ కూనంనేని

- బహుమతులు ప్రదానం చేసిన ఎంఎల్‌ఏ

భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 14 (విజయక్రాంతి): చక్కగా చూడముచ్చటి రంగులతో వేసిన ఈ ముగ్గులు ఆడ బిడ్డల కళారూపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి,ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు. స్థానిక శేషగిరి భవన్, సిపిఐ కార్యాలయంలో రోడ్, 7 నెంబర్ బజార్, పంజాబ్ గడ్డ ఏరియాల్లో సిపిఐ ఆధ్వర్యంలో సంక్రాంతిని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలో విజేతలుగా నిలిచిన వారికి కూనంనేని బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఏటా సంక్రాంతి వర్వదినాన్ని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ముగ్గుల పోటీలో గెలుపు ఓటములు సహజమని, ముగ్గుల వేసిన ప్రతీ ఒక్కరికీ బహుమతులు రావడం సాధ్యం కాదని, ముగ్గులో ఉన్న కళారూపాన్ని, రంగుల అమరిక, పండుగ శోభ ఉట్టి పడేలా వేసిన ముగ్గులను న్యాయ నిర్ణేతలు విజేతలను నిర్ణయిస్తారని చెప్పారు.

బహుమతులు సాధించిన వారు మరింత కళాశోభితంగా ముగ్గులు వేసి ప్రతిభకు వదను పెట్టుకోవాలని, బహుమతులు రాని వారు కొత్త మెలుకులు నేర్చుకుని రాబోయే రోజుల్లో బహుమతులు సాధించేందుకు కృషి చేయాలన్నారు. సంక్రాంతి పండుగ రైతులు, రైతు కూలీల వండుగని, శ్రమకి తగిన ఫలితం ఇళ్లకు చేరిన వేళ ఆనందోత్సాహాల నడుమ చేసుకునే ముచ్చటైన వేడుకని చెప్పారు. మారుతున్న కాలంలో ముగ్గులు వేయడం, కల్లాపులు చల్లడం, ఇల్లు అలకడం వంటివి తగ్గిపోయాయని, ఎక్కడ చూసినా ఫ్లోరింగ్, టైల్స్ కనిపిస్తున్నాయని చెప్పారు. ముగ్గులు వేయడం, అలకడం వంటివి చేయడం ద్వారా శాస్త్రోక్తమైన లాభాలు ఉంటాయని,శరీరంలోని నాడుల కదలికలు జరగడం ద్వారా ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.

ఇలాంటి పర్వదినాల సందర్భంగా అయినా ముగ్గులు పోటీల్లో పాల్గొనాలని సూచించారు. ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో కొత్త కాంతులు నింపాలని, రాబోయే రోజుల్లో మరింత ఉజ్వల భవిష్యత్తో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సుమారు 300 మంది వరకు పాల్గొన్న ఈ ముగ్గుల పోటీల్లో ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రధానం చేయడంతో పాటు కన్సోలేషన్ బహుమతులు, పోటీలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్కే సాబీర్ పాషా, న్యాయనిర్ణేతగా మాజీ కౌన్సిలర్ మునిగడప పద్మ, కంచర్ల జమలయ్య, మునిగడప వెంకటేశ్వర్లు, లక్ష్మీ, కైసర్, షాహిన్, జోసఫ్ తదితరులు పాల్గొన్నారు.