15-01-2026 12:59:12 AM
సర్పంచ్ గోసుల రాజేష్
కోదాడ (నడిగూడెం) జనవరి 14: మృతురాలి కుటుంబానికి అండగా ఉంటాంమని కేశవాపురం గ్రామ సర్పంచ్ గోసుల రాజేష్ అన్నారు. మండలంలోని చెన్న కేశవాపురం గ్రామానికి చెందిన చింత నాగమణి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను బుధవారం పరామర్శించి, ఓదార్చారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులకు 5000 రూపాయల నగదును అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కటికల పుల్లయ్య, మాజీ ఉపసర్పంచ్ అనంతుల ఉపేందర్, శివరాత్రి వీరబాబు, పప్పుల ఉపేందర్, కలకొండ మనోజ్, దున్న భద్రయ్య,దున్న విజయ్, పచ్చిగోళ్ళ శ్రీనివాస్, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.