20 May, 2026 | 4:50 AM

వేగంగా ధాన్యం కొనుగోలు

20-05-2026 12:36 AM

జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 

మెదక్, మే 19(విజయ క్రాంతి) :జిల్లాలో గతం కంటే అత్యంత వేగంగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి అక్రమాలు లేకుండా పారదర్శకంగా రైతుల నుంచి ఈ రోజు వరకు 1,85,688.480 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 37,072 రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి 26,191 మంది రైతులకు 260.03 కోట్ల రూపాయలు రైతుల అకౌం ట్లో జమ చేయడం జరిగిందన్నారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియ మరింత స్పీడ్ అప్ చేసి, అకాల వర్షాల నుండి కాపాడడానికి టర్పాలీను కవర్లను అందుబాటులో ఉంచాలని, మిల్లర్లు అన్లోడింగ్ ప్రక్రియను సైతం త్వరిత గతిన చేపట్టాలన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.