12 August, 2026 | 1:16 AM

మోహన్ భగవత్‌కు అరుదైన గౌరవం

12-08-2026 12:15 AM
  1. యూనివర్సల్ వన్‌నెస్ ఉత్సవాలకు ‘అహెడ్’ ఆహ్వానం
  2.    29న న్యూయార్క్‌కు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్
  3. ఆఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల వేళ ప్రతిష్ఠాత్మక వేడుక

న్యూయార్క్/న్యూఢిల్లీ, ఆగస్టు ౧౧: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) శతా బ్ది ఉత్సవాల వేళ్ల సంస్థ చీఫ్ మోహన్ భగవత్‌కు అరుదైన గౌరవం లభించింది. న్యూ యార్క్ వేదికగా ‘అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్మెంట్ అండ్ డైలాగ్’ (అహెడ్) అనే సంస్థ ఈనెల 29న ప్రతిష్ఠాత్మకంగా నిర్వహి స్తున్న ‘యూనివర్సల్ వన్‌నెస్’ వేడుకలకు ఆయన్ను ముఖ్యవక్తగా ఆహ్వానించింది.

ప్రసి ద్ధ మెడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ఈ వేడుకలు జరుగున్నాయి. అమెరికాలోని ఈశాన్య, మిడ్ -అట్లాంటిక్ రాష్ట్రాల నుంచి సుమారు 5 వేల మందికి పైగా ఇండియన్ -అమెరిక న్లు హాజరుకానున్నారు. మోహన్ భగవత్ చివరిసారిగా 2018లో చికాగో హిందూ కాంగ్రెస్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన అమెరికాలో పర్యటించనుండటం ఇదే తొలిసారి.