24 May, 2026 | 1:27 AM

కేర్‌లో బాలుడికి అరుదైన చికిత్స

24-05-2026 12:24 AM

హయత్‌నగర్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు శివదుర్గారెడ్డి దాదాపు ఐదు నెలల పాటు తీవ్రమైన వాంతులు, బలహీనత, ఆహారం తీసు కోలేకపోవడం, మలబద్ధకం వంటి సమస్యల తో తీవ్రంగా బాధపడ్డాడు. కుటుంబ సభ్యులు అనేక ఆస్పత్రులు తిరిగి, పలు పరీక్షలు చేయించినా అసలు సమస్య ఏమిటో వైద్యులు గుర్తించలేకపోయారు. కేర్ హాస్పిటల్స్, మలక్‌పేటలోని సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, రోబో టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ భూపతి రాజేం ద్ర ప్రసాద్‌ను సంప్రదించారు. అక్కడ అరుదైన ఎస్‌ఎంఏ సిండ్రోమ్ ఉన్నట్లు నిర్ధారించి, చికిత్స చేయడంతో బాలుడు కోలుకున్నాడు. 

మలక్‌పేటలోని కేర్ ఆస్పత్రిలో బాలుడి లక్షణాలను పూర్తిగా పరిశీలించిన డాక్టర్ భూ పతి, ఇది సాధారణ గ్యాస్ట్రిక్ సమస్య కాదని, సుపీరియర్ మెసెంటరిక్ ఆర్టరీ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధి కావచ్చని అనుమానించారు. మనం తిన్న ఆహారం చిన్న ప్రేగుల ద్వారా ముందుకు సాగుతుంది. కానీ ఎస్‌ఎంఏ సిండ్రోమ్ లో చిన్న ప్రేగులోని ఒక భాగం రెండు ప్రధాన రక్తనాళాల మధ్య ఇరుక్కుపోతుంది. దీనివల్ల ఆహారం సరిగా వెళ్లకపోవ డంతో తరచుగా వాంతులు, పొట్ట నొప్పి, బలహీనత, బరువు తగ్గడం, జీర్ణ సమస్యలు వస్తాయి.

ఈ లక్షణాలు సాధారణ గ్యాస్ లేదా అజీ ర్ణ సమస్యల లాగా కనిపించడంతో చాలాసార్లు ఈ వ్యాధి గుర్తించబడదని తెలిపారు. నిర్ధారణ కోసం సీఈసీటీ అబ్డొమెన్ స్కాన్ చేయించగా, మొదటి రిపోర్టులో అన్నీ సాధారణంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే డాక్టర్ భూపతి అనుమానం తొలగకపోవడంతో స్వయంగా స్కాన్ ఫిల్మ్‌ను పరిశీలించి, రేడియాలజిస్టులతో చర్చించారు.

అనంతరం మళ్లీ పరిశీలించగా ఎస్‌ఎంఏ సిండ్రోమ్ ఉన్న ట్లు నిర్ధారణ అయింది. తర్వాత బాలుడికి లాపరోస్కోపిక్ డ్యూడెనోజెజునోస్టమీ అనే అత్యాధునిక మినిమల్ ఇన్వేసివ్ శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ శస్త్రచికిత్సలో ఇరుక్కుపోయిన చిన్న పేగు భాగాన్ని దాటేలా కొత్త మార్గం ఏర్పాటు చేస్తారు. ఆపరేషన్ విజయవంతమై, బాలుడు కేవలం మూడు రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం బాలుడు పూర్తి గా కోలుకుని సాధారణంగా ఆహారం తీసుకుంటూ, తన రోజువారీ జీవితాన్ని తిరిగి ప్రారంభించాడు.

డాక్టర్ భూపతి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఇది  సాధారణ గ్యాస్ట్రిక్ సమస్య లాగా కనిపించే అరుదైన వ్యాధి అన్నారు. కేర్ హాస్పిటల్స్, మలక్పేట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ఎడ్లా మాట్లాడుతూ, క్లిష్టమైన వైద్య సమస్యల్లో నిపుణుల అనుభవం, పట్టుదల, సమన్వయంతో కూడిన వైద్యసేవలు ఎంత ముఖ్యమో ఈ కేసు చూపించింది. సరైన సమయంలో సరైన నిర్ధారణ రోగి జీవితాన్ని మార్చగలదు’ అన్నారు.