26 April, 2026 | 3:24 AM

పరిశ్రమలో నిలిచిపోయే చిత్రం కన్న

26-04-2026 12:50 AM

మాధురి ప్రజెంట్స్, పాషనేట్ ఫిలిం మేకర్స్, సినిమాటిక్ విజువల్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్న తాజాచిత్రం ‘కన్న’. ఎస్‌ఎన్ రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హీరో చైతన్యరావు, హీరో కార్తిక్ శివన్, హీరోయిన్ గీతికా రథన్, మంజు వెంకట్, డైరెక్టర్ నాని కాసరగడ్డ హాజరయ్యారు.

ఈ సందర్భంగా హీరో కార్తిక్ శివన్ మాట్లాడుతూ.. “ప్రస్తుతం నాకు ఏ సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఇప్పటివరకు తన వెన్నంటి నడిపిన తన తండ్రినే తనకు బ్యాక్‌గ్రౌండ్. సినిమా విడుదలైన తర్వాత ఈ మూవీ నాకు బ్యాక్‌గ్రౌండ్ అవుతుంది. ఈ సినిమా అందరికి కనెక్ట్ అవుతుందని చెప్పారు. క్రికెట్, లవ్, ఎమోషనల్ స్టోరీ ఈ మూడు ఎమోషన్స్ ప్రధానంగా సినిమాలో చూపించాం. ‘కన్న’ చిత్రం పరిశ్రమలో నిలిచిపోతుంది” అన్నారు.

‘సినిమా క్రికెట్ చుట్టూ సీరియస్‌గా కాదు చాలా సరదాగా, మన చిన్నతనంలోని చాలా విషయాలను గుర్తు చేస్తుంది. ‘కన్న’ లాంటి క్యారెక్టర్ ప్రతీ ఊరిలో ఒక్కడు ఉంటాడ’ని డైరెక్టర్ రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. నిర్మాత కృష్ణ మాట్లాడుతూ.. “సినిమా అంటే ఎంతో ఇష్టం. అందుకే సినిమాకు సంబంధించిన ఏ పని అయినా చేస్తా” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కిట్టయ్య, రూపేశ్, ప్రేమ్‌కృష్ణ, సూరజ్, రామ్ పటాస్, వేణు, రవీంద్ర, వెంకీ, మురళి, బంటు, దేవా, బృందావనం మూవీటీమ్ తదితరులు పాల్గొన్నారు.