23 June, 2026 | 11:56 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

డింపుల్ ప్లాన్ సింపుల్‌గా లేదు కాకాజీ!

25-04-2026 12:48 AM

అగ్ర నటుడు చిరంజీవితో దర్శకుడు బాబీ ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మరో సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. తండ్రీకూతురు మధ్య ఉండే బలమైన భావోద్వేగాలకు మాస్ యాక్షన్‌ను జోడించి ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట డైరెక్టర్ బాబీ. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన ప్రియమణి నటిస్తుండగా, మోహన్‌లాల్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇదిలావుండగా ఈ సినిమాలో విలన్ రోల్ విషయమై నెట్టింట తా జాగా హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ సర్కిళ్లలో హాట్ టాపిక్‌గా మారింది.

అచ్చ తెలుగు అందాల తార డింపుల్ హయాతి ఈ సినిమాలో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో కనిపిం చనుందట.  గ్లామర్ పాత్రలకే పరిమితమైన డింపుల్‌కు దర్శకుడు బాబీ ఈసారి నెగటివ్ షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ ఛాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. దశాబ్దానికి పైగా చిత్ర పరిశ్రమలో ఉన్నప్ప టికీ, కెరీర్‌ను మలుపు తిప్పే పెద్ద ప్రాజెక్టులు డింపుల్‌కు దక్కలేదు. అందుకే ఆమె ఇప్పుడు తన గ్లామర్ ఇమేజ్‌ను అధిగమించి, వెరైటీ రోల్స్‌లో రాణించే దుకు ఆమె సిద్ధమవుతోందని తాజా వార్తలను బట్టి తెలుస్తోంది.

‘గల్ఫ్’ నుంచి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వరకు సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న డింపుల్.. ఇప్పుడు మెగాస్టార్‌నే ఢీకొట్టే పవర్ ఫుల్ నెగెటివ్ రోల్‌లో మెరిసే మెగా ఛాన్స్ రావడం గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ రాబోయే చిత్రంలోనూ డింపుల్ నటించే అవకాశం ఉందని టాక్.