రాష్ట్రానికి కేంద్రం నిధులు... సచివాలయం వద్ద చర్చకు సిద్ధం
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో నిర్భందాలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారని, రైతులకు పరిహారం ఇచ్చాకే పండ్ల మార్కెట్ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. భూములు తీసుకునే రైతులకు పరిహారం ఇవ్వాల్సిందే అని, రైతులు వ్యతిరేకిస్తున్న పండ్ల మార్కెట్ కు శంకుస్థాపన చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆరోపించారు.
బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను తిరగనియ్యమంటూ హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు రైతుల భూములను కాజేస్తున్నారు. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్లు ఇచ్చామని, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై తెలంగాణ సచివాలయం వద్ద చర్చకు సిద్ధం.. మీరు సిద్ధంగా ఉన్నారని రామచందర్ రావు కాంగ్రెస్ నాయకులను సవాలు విసిరారు.






