2 September, 2026 | 8:37 PM

Breaking News

రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •   ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది రేవంత్ రెడ్డి.. ఖబర్దార్   •  

మధుమేహుల బైపాస్ సర్జరీకి అభయం

15-05-2026 | 01:16am

డాక్టర్ లోకేశ్వరరావు సజ్జా నేతృత్వంలో అధ్యయనం

హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): మధుమేహ హృద్రోగుల్లో గుండె రక్తనాళాల బైపాస్ సర్జరీ పరంగా దీర్ఘకాలిక ఫలితాలు, ప్రయోజనాలకు సంబంధించి తాజాగా ఒక అధ్యయనం కొనసాగుతోంది. ఐసిఎన్‌ఆర్ నిధులతో కొనసాగుతున్న ఈ అధ్యయనానికి ప్రముఖ హృద్రోగ నిపుణులు, స్టార్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్, సజ్జా హార్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ డాక్టర్ లోకేశ్వరరావు సజ్జా నేతృత్వం వహిస్తున్నారు.

ఇటీవల షికాగో లో జరిగిన అమెరికన్ అసోసియేషన్ ఫర్ థొరాసిక్ సర్జరీ వార్షిక సదస్సులో ఈ అధ్యయనాన్ని, ఫలితాలనూ ఆయన ఆవిష్కరిం చారు. ‘సాధారణంగా మధుమేహుల్లో ఇన్ఫెక్షన్ భయంతో ఛాతీలోని ఒక మామరీ ధమ నే వాడుతుంటారు. కానీ, రెండు ధమనులను వాడటం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనా లు ఎక్కువగా ఉంటాయని అధ్యయనం చె బుతోంది. ’స్కెలెటనైజ్డ్’ అనే ఆధునిక పద్ధతిలో రక్తనాళాలను సేకరించడం వల్ల, మధు మేహులు అయినప్పటికీ ఛాతీ ఎముక ఇన్ఫెక్షన్ ముప్పును తగ్గించవచ్చు.

కాళ్లలోని సిరల ను వాడినప్పుడు బృహద్ధమని ద్వారా ప్లేక్స్ కదిలి పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. దానికి బదులు ధమనులను వాడటం వల్ల ఈ ముప్పు తప్పుతుంది. భారతీయుల్లో త క్కువ వయసులోనే గుండె జబ్బులు వస్తున్న నేపథ్యంలో, ధమనుల ద్వారా చేసే బైపాస్ ఎక్కువ కాలం (జీవితకాలం) మన్నుతుంది. దీనివల్ల రెండోసారి సర్జరీ అవసరం పడదు. మధుమేహం ఉన్నప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకుని ఒకటి కంటే ఎక్కువ ధమనులను ఉపయోగించడం వల్ల బైపాస్ సర్జరీ ఫలితాలు మరింత మెరుగ్గా, సురక్షితంగా ఉంటా యని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది’ అని వెల్లడించారు.