రెబల్ స్టార్ ప్రభాస్ కాలికి గాయం
16-12-2024 07:24 PM
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు రెబల్ స్టార్ ప్రభాస్ కాలుకు స్వల్ప గాయమైంది. షూటింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఆయన కాలు బెణికినట్లు ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. జనవరి 3న తాను నటించిన కల్కి 2898 ఏడీ జపాన్ లో విడుదల కానుంది. ప్రమెషన్ లో భాగంగా ఆయన మొదటి సారి జపాన్ వెళ్లానున్నారు. ఈ ప్రమాదంతో ప్రభాస్ జనవరి 3న జపాన్ లో నిర్వహించే పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం ఈ సందర్బంగా జపాన్ లో ఉన్న అభిమానులు తనను క్షమించాలంటూ, తనపై చూపుతున్న ప్రేమాభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ పోస్టు చేశారు. దీంతో ఆయన వీరాభిమానులు గాయం నుంచి ప్రభాస్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.






