9 July, 2026 | 1:33 PM

ఏ ముహూర్తాన కిస్సిక్ పాట చేసిందో కానీ..

17-12-2024 12:00 AM

ప్రస్తుతం టాలీవుడ్‌లో బాగా వినిపిస్తున్న ముద్దుగుమ్మల పేర్లలో శ్రీలీల ఒకటి. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాటి నుంచి హిట్, ఫట్‌లతో సంబంధం లేకుండా దూసుకెళుతున్నారు. ఇక ఏ ముహూర్తాన ‘కిస్సిక్ కిస్సిక్..’ పాట చేసిందో కానీ అవకాశాలు మరింత ఎక్కువగా వెదుక్కుంటూ వచ్చేస్తున్నాయి. డ్యాన్సులతో కుర్రకారును ఒక ఊపు ఊపేయడమే కాకుండా చిన్న, పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమా అవకాశాలను పట్టేస్తున్నారు. అఖిల్ అక్కినేని సరసన హీరోయిన్‌గా ఎంపికయ్యారు. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘లెనిన్’ అనే టైటిల్ ఖరారైంది. మరో అక్కినేని మారో నాగ చైతన్యతోనూ జత కట్టనుందని టాక్. కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో నాగచైతన్య, శ్రీలీల జంటగా నటించనున్నారట. ప్రస్తుతం రాబిన్ హుడ్, మాస్ జాతర, ఉస్తాద్ భగత్‌సింగ్, ఎస్కే25 సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే నవీన్ పొలిశెట్టి, సిద్దూ జొన్నలగడ్డ సినిమాల్లోనూ శ్రీలీల నటించనున్నారని సమాచారం. మొత్తానికి శ్రీలీల చాలా బిజీ హీరోయిన్ అయిపోయారు.