30 June, 2026 | 8:38 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

గ్రేటర్‌లో తగ్గిన విద్యుత్ వినియోగం

17-01-2025 02:23 AM

*  సంక్రాంతికి నగరవాసులు పల్లెబాట పట్టడమే కారణం

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 16 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరం రోజురోజుకు విస్తరించడం, నూతన కాలనీల ఏర్పాటు, పరిశ్రమల రాకతో ప్రతి ఏడాది విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతోంది. అయితే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వరుస సెలవులు రావడంతో నగరవాసులు పెద్ద సంఖ్యలో పల్లెబాట పట్టడంతో నగరం సగానికి పైగా ఖాళీ అయ్యింది.

దీంతో విద్యుత్ వినియోగం సైతం భారీగా తగ్గింది. సాధారణంగా జనవరిలో చలి ప్రభావం నేపథ్యంలో విద్యుత్ వినియోగం తక్కువగానే ఉంటుంది. అయితే దీనికి సంక్రాంతి సెలవులు తోడవడంతో  ఈనెల 11వ తేదీ నుంచి గ్రేటర్ పరిధిలో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పడిపోయింది. 

ఈ పరిస్థితిలో సంక్రాంతి పండుగ కంటే ముందు 7వ తేదీన అత్యధికంగా 3,271 మెగావాట్లు విద్యుత్ డిమాండ్ ఉండగా, 14న విద్యుత్ వినియోగం 2,580 మెగావాట్లుగా నమోదయ్యింది.  ఓసారి సంక్రాంతికి ముందు, సంక్రాంతి సందర్భంగా విద్యుత్ వినియోగాన్ని గమనిస్తే..