22 August, 2026 | 5:27 PM

రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం

30-06-2026 08:13 PM

- సీపీ రష్మీ పెరుమాళ్ 

సిద్దిపేట క్రైం: సిద్దిపేట పోలీస్ విభాగంలో ఉద్యోగ విరమణ చేసిన సిబ్బంది సేవలను మరువబోమని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. వారి కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా తనను సంప్రదించవచ్చని సూచించారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘ కాలంగా విధులు నిర్వహిస్తున్న ఆఫీస్ సూపరింటెండెంట్ వై.వెంకటేశ్వరరావు, ఏఎస్ఐలు ఎడ్ల రాంమ్మూర్తి, వరికోటి నవీన్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ మామిడిపల్లి పెంటయ్య మంగళవారం ఉద్యోగ విరమణ పొందారు. వారికి సీపీ రష్మీ పెరుమాళ్ అభినందనలు తెలుపుతూ, సన్మాన పత్రం మెమొంటో అందజేసి సన్మానించారు. ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలను పొందారని శుభాకాంక్షలు తెలియజేశారు.  కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కుశాల్కర్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.