30 June, 2026 | 8:50 PM

Breaking News

సమగ్ర విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోలేదు   •   సింగరేణి అధికారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు టీబీజీకేఎస్ సంఘీభావం: కాపు కృష్ణ   •   మా పాఠశాలలో పిల్లలను చేర్పించండి   •   పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి ఘన సన్మానం: డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం రాథోడ్   •   రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •  

సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం

30-06-2026 08:11 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం కార్పొరేట్ హెడ్ ఆఫీస్ ముందు సింగరేణి అధికారులకు సంబంధించిన PRP (Performance Related Pay) నిలుపుదలను వ్యతిరేకిస్తూ CMOAI ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు, తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్, INTUC సెక్రటరీ జనరల్ డాక్టర్ బి. జనక్ ప్రసాద్ సంఘీభావం ప్రకటించి, అధికారులకు తన పూర్తి మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా డా. జనక్ ప్రసాద్ మాట్లాడుతూ... సింగరేణి అధికారులకు సంబంధించిన న్యాయమైన సమస్యలను ప్రభుత్వం, సంస్థ యాజమాన్యం సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని కోరారు.

అధికారుల PRP నిలుపుదల అంశాన్ని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అలాగే, ఇటీవల సోమవారం ఈ అంశంపై సింగరేణి డైరెక్టర్లు మరియు సీఎండీతో జరిగిన సమావేశంలో కూడా చర్చించినట్లు వెల్లడించారు. అధికారులకు PRP చెల్లించేందుకు ఎలాంటి సాంకేతిక లేదా పరిపాలనా ఇబ్బందులు లేవని, సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని వారు అభిప్రాయపడినట్లు తెలిపారు. సింగరేణి అభివృద్ధిలో అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నందున, వారికి రావాల్సిన న్యాయమైన ప్రయోజనాలను ఆలస్యం చేయకుండా వెంటనే అందించాలని డా. జనక్ ప్రసాద్ డిమాండ్ చేశారు.