యూపీహెచ్‌సీకి ఫ్రిజ్ వితరణ
కొత్తగూడెం, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 18వ డివిజన్ ప్రాంతంలో ఉన్నటువంటి( యూపీ హెచ్ ఎస్ సి,) అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు, రోగుల అవసరార్థం ఆసుపత్రికి వచ్చే రోగుల కొరకు లైన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం , ఈ వేసవి తాపానికి తట్టుకోలేని పేషెంట్స్ కొరకు గురువారం ఫ్రిజ్ వితరణ చేశారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కంచర్ల జమలయ్య ,18 వ డివిజన్ కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ , ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
వీరి చేతుల మీదుగా ఆసుపత్రి యాజమాన్యానికి ,డాక్టర్ రాము వారి బృందానికి, ఈ యొక్క ఫ్రీజ్ ను వైద్యశాలకు వచ్చేటువంటి రోగుల దాహార్తిని,తీర్చేందుకు సూర్యతాపం నుండి కొంత ఉపశమనం కలిగించేందుకు, లయన్స్ క్లబ్ అందించిన ఈ యొక్క సహాయాన్ని పలువురు కొనియాడారు. ఆసుపత్రికి వచ్చే రోగుల అవసరార్థం , శీతల పానీయం, ప్రజలకు కొంత ఉపశమనం కలిగిస్తుందని, ఈ సదుపాయాన్ని ఆసుపత్రికి వచ్చేటువంటి రోగులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కంచర్ల హిమశ్రీ కార్పోరేటర్ పేర్కొన్నారు.




