25 August, 2026 | 9:58 PM

క్రీడలతో మానసికోల్లాసం

14-03-2025 01:59 AM

 కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్లగొండ, మార్చి 13 (విజయక్రాంతి) :  క్రీడలతో మానసికోల్లాసం సాధ్యమని కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్లో పోలీస్ స్పోరట్స్ అండ్ గేమ్స్ మీట్ టు కలెక్టర్ ముఖ్యతిథిగా హాజరై ప్రారంభించారు.

శారీరక దారుఢ్యంతోపాటు మానసిక వికాసానికి క్రీడలు దోహదపడతాయన్నారు. అనంతరం ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములు సహజమని క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడాలని సూచించారు. స్పోరట్స్ మీట్ పోలీసులు తమ క్రీడా నైపుణ్యం ప్రదర్శించేందుకు చక్కని వేదికని పేర్కొన్నారు. సుమారు 300 మంది అధికారులు, సిబ్బంది క్రీడల్లో పాల్గొనున్నారు.

మూడు రోజులపాటు కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, ఫుట్బాల్, అథ్లెటిక్స్, షాట్పుట్ తదితర పోటీలు నిర్వహించనున్నారు. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్ల తోపాటు నల్లగొండ ఏఆర్ విభాగం జట్లు ప్రాతినిధ్యం వహించాయి. కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక, ఎస్బీ డీఎస్పీ రమేశ్, డీటీసీ డీఎస్పీ విఠల్ రెడ్డి, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు,ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.