26 August, 2026 | 2:35 AM

లక్షకోట్లు గోదారిలో పోశారు!

14-03-2025 01:57 AM
  1. నాణ్యతలేని నిర్మాణం చేపట్టిన ఘనత గత బీఆర్‌ఎస్ సర్కార్‌దే
  2. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి విలువైన సలహాలు ఇవ్వాలి
  3. మండలిలో పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్

హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): గత బీఆర్‌ఎస్ సర్కారు కాళేశ్వరాన్ని నిర్మించి రూ.లక్ష కోట్లను గోదావరిలో పోసిందని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. నాణ్యత లేని నిర్మాణం కట్టి రూ.లక్ష కోట్లు వృథా చేసిన ఘనత బీఆర్‌ఎస్‌దేనన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, తన విలువైన సలహాలను అందించాలని కోరారు.

బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా చేసిన గవర్నర్ ప్రసంగంపై బీఆర్‌ఎస్ చేసిన విమర్శలను తిప్పికొట్టారు.  తొలుత శాసనమండలిలో గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రవేశపెట్టారు.

ఈసందర్భంగా మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనతో పోల్చితే.. 14 నెలల్లో తాము మెరుగైన పాలన అందించామన్నారు. అనంతరం సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డి, బీఆర్‌ఎస్‌కు చెందిన తాతా మధు, సత్యవతి రాథోడ్ తదితరులు మాట్లాడారు. 

ప్రభుత్వంపై విమర్శలు సరికాదు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న తమ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని కాంగ్సెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హితువుపలికారు. బీఆర్‌ఎస్ హయాంలో నాయకులు సొంతంగా డ్రాయింగ్‌లు గీయడం వల్లే మేడిగడ్డ కూలిపోందని విమర్శించారు. ఉగాది నుంచి అందరికీ తమ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తుందన్నారు. రాష్ర్టంలో నేడు ఏర్పడి కరువుకు బీఆర్‌ఎస్సే కారణమన్నారు.

33శాతం మహిళా రిజర్వేషన్‌లో బీసీలకు వాటా ఇవ్వాలి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

చట్టసభల్లో మహిళలకు ఇవ్వనున్న 33 శాతం రిజర్వేషన్‌లో ఎస్సీ, ఎస్టీతో పాటు బీసీ ల వాటా కూడా ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలి తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు. రాష్ర్టంలో మహిళలు రూ.2,500 కోసం ఎదురుచూస్తున్నార న్నారు.

ఆరు గ్యారంటీల గురించి అడిగే.. సీఎం ఆర్థిక పరిస్థితి సరిగాలేదని అంటున్నారని, ఇది సరికాదన్నారు. ఎన్నికలప్పుడు ఈ మాట చెబితే జనాలు ఓటేసేవారా? అని ప్రశ్నించారు. బీసీలకు ఎన్నికలప్పుడు అనేక హామీలు ఇచ్చారని, వాటిని అమలు చేయడానికి డబ్బులు లేవని సీఎం అనడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

ప్రాజెక్టులకు అంచనాలు పెంచుకోవడానికి డబ్బులు ఉంటాయి కానీ, బీసీలకు కేటాయించడానికి ఉండవా అని ప్రశ్నించారు. రాష్ర్టంలో కులగణన సరిగా జరలేదని, సర్వే గణాంకాలు, ఇతర ప్రభుత్వం లెక్కలతో పోల్చితే మొత్తం జనాభాలో చాలా వ్యత్యాసం వస్తోందన్నారు. 

బీఆర్‌ఎస్ సభ్యులపై మంత్రి సురేఖ ఫైర్

ఉద్యోగాలు, రాష్ర్టంలో అభివృద్ధి కార్యక్ర మాలపై ప్రతిప క్ష సభ్యులు అ డిగి ప్రశ్నలకు మండలిలో మంత్రి కొండా సురేఖ సమాధానం ఇచ్చారు. అయితే సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికార పార్టీ నుంచి మంత్రి సమాధానం ఇస్తుండగా.. బీఆర్‌ఎస్ సభ్యులు రన్నింగ్ కామెంట్రీ చేయ గా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా సాంప్రదాయాలు, పద్ధతులు నియమాలను పాటించాలని బీఆర్‌ఎస్ మండలి సభ్యులకు సురేఖ హితువు పలికారు. రేషన్‌కార్డుల మీద బీఆర్‌ఎస్‌కు ప్రశ్నించే అర్హత ఉందా? అని ఆమె నిలదీశారు.