కాంగ్రెస్ పార్టీకి బొంగరం జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి రాజీనామా
25-08-2026 09:39 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొంగరం జనార్దన్ రెడ్డి, నేరెళ్ల వైస్ ప్యాక్స్ చైర్మన్ బొంగరం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడికి అందజేశారు. వీరి రాజీనామా మండల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.






