ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ఫస్టియర్‌లో 63.86 శాతం, సెకండియర్‌లో 43.77 శాతం ఉత్తీర్ణత
హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఫలి తాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజాతో కలిసి ఫలితాలను సచివాలయంలోని ఆయన చాంబర్‌లో విడుదల చేశారు. ఫస్టియర్‌లో 63.86 శాతం, సెకండియర్‌లో 43.77 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్‌లో మొత్తం 2,54,498 (జనరల్) మం ది పరీక్షలు రాయగా, వీరిలో 1,62,520 (63.86 శాతం) మంది పాస్ అయ్యారు.
ఇందులో ఇంప్రూవ్‌మెంట్ క్యాటగిరీకి చెంది న వాళ్లు 1,06,484 మంది కాగా, నాన్ ఇం ప్రూవ్‌మెంట్ విద్యార్థులు 56,036 మంది ఉన్నారు. మార్చిలో నిర్వహించిన రెగ్యులర్ పరీక్షల్లో ఫస్టియర్‌లో 74.1 శాతం మంది పాసయ్యారు. ఇంటర్ సెకండియర్‌లో 43. 77 శాతం మంది పాస్ అయ్యారు. పరీక్షకు 1,38,477 (జనరల్) మంది రాయగా 60, 615 (43.77 శాతం) మంది ఉత్తీర్ణులయ్యా రు. మార్చిలో రాసిన పరీక్షల్లో సెంకడియర్‌లో 76.69 శాతం మంది పాస్ కాగా, సప్లి మెంటరీ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గింది. వొకేషనల్‌లో ఇలా...
వొకేషనల్ ఫస్టియర్‌లో 53.24 శాతం ఉత్తీర్ణత సాధించారు. 18,913 మంది విద్యార్థులు హాజరుకాగా, 10,070 మంది పాస్ అయ్యారు. సెకండియర్‌లో వొకేషనల్ విభాగంలో 51.12 శాతం మంది పాస్ అయ్యారు. 15,136 మంది పరీక్షలు రాయగా, వారిలో 7,737 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇదిలా ఉంటే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఈనెల 25 నుంచి 29 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా తెలిపారు.






