29 July, 2026 | 8:31 AM

పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు ఊరట

29-11-2024 11:34 AM

హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. నరేందర్ రెడ్డిపై నమోదైన 3 ఎఫ్ఐఆర్ లలో రెండింటిని హైకోర్టు కొట్టివేసింది. లగచర్ల కలెక్టర్ పై జరిగిన దాడి ఘటనలో బొంరాస్ పేట పోలీసులు మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. ఒకే ఘటనపై వేరువేరు కేసులు నమోదు చేయడంతో నరేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ అంశం విచారణ చేసిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పట్నం నరేందర్ రెడ్డి హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.