నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో
నిజాంసాగర్ జూలై 29( విజయ క్రాంతి): ఉమ్మడి జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 6500 క్యూసెక్కుల స్వల్ప ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు క్యాచ్ మెంట్ ఏరియా పరిధిలో వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1395. 40అడుగులతో 7.139 టీఎంసీల నీటి నిల్వతో కొనసాగుతొందని అయన తెలిపారు. వర్షాకాలం ప్రారంభం నుండి చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు కురియకపోవడంతో రైతులు నిరుత్సాహపడ్డారు. గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుడటం తో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరదనీటి ప్రవాహం ప్రారంభం కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం ప్రాజెక్టులో 1391.40అడుగులతో 4.597 టిఎంసిల నీరు నిల్వ ఉంది.






