18 May, 2026 | 11:13 PM

తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేయండి

20-06-2024 12:43 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరిన టీఎన్జీవో

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉద్యోగులను వెంటనే రిలీవ్ చేయాలని టీఎన్జీవో కోరింది. కమలనాథన్ కమిటీ ద్వారా ఏపీకి కేటాయించిన 144 మంది ఉద్యోగులను తిరిగి తెలంగాణకు పంపాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, సీఎం కార్యదర్శిని బుధవారం అమరావతిలో సంఘం నేతలు కలిసి విజ్ఞప్తి చేసినట్టు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ పేర్కొన్నారు. ఏపీ అధికారులను కలిసిన వారిలో టీఎన్జీవో ప్రధానకార్యదర్శి ముజీబ్, అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, ఎం సత్యనారాయణగౌడ్ తదితరులు ఉన్నారు.