పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
20-06-2024 12:43 AM
హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): రానున్న ఐదు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా సముద్రమట్టానికి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపలి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ నెల 24 వరకు పలుచోట్ల ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.






