30 March, 2026 | 4:30 PM

పీఎస్‌లో మద్యం సీసాల డంప్ తొలగింపు

24-09-2024 12:00 AM

వెల్దుర్తి, సెప్టెంబర్ 23: మెదక్ జిల్లా మాసాయిపేట పోలీస్‌స్టేషన్ ఆవరణలో చెత్తాచెదారం పేరుకోవడం, మద్యం సీసాల డంప్ ఉండటంపై ఈనెల 21న ‘ఖాకీలు లేని ఠాణాలో ఖాళీ మద్యం సీసాలు’ అనే శీర్షికన ‘విజయక్రాంతి’లో ప్రచురితమైన కథనానికి పోలీసు అధికారులు స్పందించారు. కార్మికులతో ఆదివారం చెత్తాచెదారంతోపాటు మద్యం సీసాల డంప్‌ను వెంటనే తొలగింపజేశారు.