29 July, 2026 | 3:17 PM

విద్యుత్ లైన్ల కింద ఉన్న చెట్ల తొలిగింపు

29-07-2026 02:43 PM

గుండాల, (విజయక్రాంతి): మండల పరిధి శంభునిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ సుమలత, ఆమె భర్త రాజబాబు ఆధ్వర్యంలో బుధవారం విద్యుత్తు లైన్ల కింద ఉన్న చెట్ల కొమ్మలను శంభునిగూడెం నుంచి వెన్నెలబైలు గ్రామం వరకు గ్రామస్థుల సహకారంతో తొలగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... వర్షాలు, గాలుల వల్ల విద్యుత్ లైన్ల కింద ఉన్న చెట్ల కొమ్మలు నిత్యం తీగలకు తగలడంతో కరెంటు సరఫరా ఆగిపోయి శంభునిగూడెం గ్రామపంచాయితీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గమనించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. ఆమె పిలుపును గౌరవించిన ఆ పంచాయతీ ప్రజలు నేను సైతం అంటూ గొడ్డలి తీసుకొని సుమారు 12 కిలోమీటర్ల విద్యుత్ లైన్ ను క్లియర్ చేశారు. ఈ చెట్ల కొమ్మల వల్ల గాలి రాగానే కరెంటు పోవడంతో రాత్రి పూట చిన్న పిల్లలు దోమ కాటుకి గురికావడం గమనించి గ్రామపంచాయితీ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దొర, పటేల్, వార్డ్ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.