కరోనా కాలపు అద్దెలు మినహాయించాలి
కలెక్టర్‌కు బీఎస్పీ నేతల వినతి
షాద్‌నగర్, ఆగస్టు 3 (విజయక్రాంతి): కరోనా వల్ల ఆర్థికంగా దెబ్బతిన్న ఎస్సీ కార్పొరేషన్ దుకాణాల లబ్ధిదారులను ఆదుకోవాలని కోరుతూ బీఎస్పీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ కొంగరకలాన్ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ దృష్ట్యా 22 మార్చి 2020 నుండి 22 మార్చి 2022 వరకు ఉన్న రెండు సంవత్సరాల అద్దె బకాయిలను పూర్తిగా రద్దు చేయాలి.వ్యాపార నష్టాలను పరిగణనలోకి తీసుకుని లీజు కాలాన్ని అదనంగా మరో రెండేళ్లు పొడిగించాలి. అద్దె బకాయిల వల్ల రద్దు చేసిన దుకాణాలను తిరిగి పాత లబ్ధిదారులకే కేటాయించాలని కోరారు. బకాయిల పేరుతో ఎస్సీ యువతపై పెట్టిన పోలీస్ కేసులను, అధికారుల వేధింపులను వెంటనే నిలిపివేయాలని కలెక్టర్ కు విన్నవించారు






