13 May, 2026 | 1:41 AM

వైభవంగా రేణుకా ఎల్లమ్మ జమదగ్ని కల్యాణ మహోత్సవం

13-05-2026 12:53 AM

ఘట్ కేసర్, మే 12 (విజయక్రాంతి) : పోచారం డివిజన్ ఇస్మాయిల్ ఖాన్ గూడలో మంగళవారం శ్రీరేణుక ఎల్లమ్మ అమదగ్నిల కళ్యాణ మహాత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరిగింది. ఆలయ వ్యవస్థాపకులు ఈగ లలిత కృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో దేవాలయం ముందు కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి శ్రీరేణుక ఎల్లమ్మ జమదగ్నిల వారి కళ్యాణాన్ని వేదపండితులు, బ్రాహ్మణోత్తముల  మంత్రోచ్ఛరణంతో అతివైభవంగా జరిపించారు.

కళ్యాణ మహోత్సవంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ స్థానిక నాయకులతో కలిసి పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మహోత్సవంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో భక్తజనులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఈసందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ దర్శకర్తలు ఈగ లాస్య మధు ముదిరాజ్, ఈగ నందని రాము ముదిరాజ్ లతో పాటు స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.