12 June, 2026 | 12:59 AM

గజ్వేల్ ప్రధాన రహదారి మరమ్మతు పనులకు శ్రీకారం

12-06-2026 12:18 AM

గజ్వేల్, జూన్ 11: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారిలో ఏర్పడిన గుంతల కారణంగా ప్రజలు, వాహనదారులు ఎదుర్కొం టున్న ఇబ్బందులను తొలగించేందుకు ము న్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ రోడ్డు మరమ్మత్తు పనులను ప్రారంభించా రు. రోడ్డు రిపేర్లతో పట్టణ ప్రజలు పడుతున్న ఇబ్బందులను బిఆర్‌ఎస్ నాయకులు ప్రతాపరెడ్డి ద్వారా జాతీయ రహదారుల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పనుల నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు ఈ సందర్భంగా చైర్పర్సన్ చందన రవీందర్ తెలి పారు.

ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలు కల్పించడం మున్సిపాలిటీ ప్రాధాన్య లక్ష్యమన్నారు. ప్రధాన రహదారిలో గుంతల కారణంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని వెంటనే మర మ్మత్తు పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కళ్యాణ్కర్ పద్మాబాయి నర్సింగ్, కౌన్సిలర్లు బొగ్గుల స్వప్న సురేష్, మన్నె రూప వెంకట్తో పాటు పలువురు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.