7 May, 2026 | 3:21 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

మంగళపర్తి జెడ్పీహెచ్‌ఎస్‌లో మరమ్మతులు

12-09-2024 01:20 AM

వెల్దుర్తి, సెప్టెంబర్ 11: వెల్దుర్తి మండలం మంగళపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పారిశుద్ధ్యం లోపించడమే కాకుండా నీటి సంపు ప్రమా దకరంగా మారడంపై ‘సమస్యల ఒడిలో సర్కారు బడి’ అనే శీర్షికన ‘విజయక్రాంతి’లో ఇటీవల ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వెల్దుర్తి ఎంపీడీవో ఉమాదేవి పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శి ఖదీర్‌ను ఆదేశించారు.

దీంతో పారిశుద్ధ్య సిబ్బంది బుధ వారం నీటి సంపులోని మురుగు నీటిని తొలగించి సంపునకు తాత్కాలికంగా రేకులతో కప్పు ఏర్పాటు చేశారు. అలాగే పాఠశాలలో మూత్రశాలలను, కుళాయిలను బ్లీచింగ్ పౌడర్‌తో శుభ్రం చేసి నిల్వ నీరు లేకుండా చేశారు. ప్రమాదకరంగా ఉన్న బోరు మోటార్ కరెంట్ వైర్లను సరిచేశారు. పాఠశాల ఆవరణలో ప్రమాదకరంగా ఉన్న ఎం డిన చెట్టును తొలగించనున్నట్లు ఎంపీడీవో ఉమ తెలిపారు.