సొంత ఖర్చులతో కాలువలకు మరమ్మతులు
సాగునీటి కోసం అన్నదాతల అగచాట్లు
ములుగు టౌన్, మార్చి 29 (విజయక్రాంతి): ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం చెరువు కోట కాలువ పరివాహక రైతులు సాగునీరు కోసం సొంత ఖర్చులతో కాల్వలను మరమ్మత్తులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట కాల్వ పరిధిలో యా సంగి వరి సాగు కోసం లక్నవరం చెరువు నీటి విడుదలకు అధికారులు తైబంది ఇచ్చినప్పటికీ, కాలువలో పేరుకుపోయిన తుంగ, నాచు వల్ల నీరు దిగువకు రావడంలేదని వాపోతున్నారు.
కాలువల దుస్థితి పై నీటిపారుదల శాఖ అధికారులు, ఇతర ప్రజాప్రతి నిధులకు అనేకసార్లు ఫిర్యాదులు, విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడంలేదని, దీనితో ఆయకట్టు రైతులు తలా ఎనిమిది వందల రూ పాయలు పోగేసి జేసీబీ యంత్రాలతో కాల్వలకు మరమ్మతులు చేయించుకోవాల్సిన ప రిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాల్వల మర మ్మతుకు ప్రత్యేక నిధులు కేటాయించి, ఈ వేసవి లో పంట కోతల తర్వాత మరమ్మతు లు చేయించాలని కోరుతున్నారు.




