30 March, 2026 | 2:33 AM

నిరుపేదల ఆరాధ్యుడు ఎన్టీఆర్

30-03-2026 12:53 AM

* ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణలో వక్తలు 

మంగపేట, మార్చి 29 (విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నటుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్నిమండల కేంద్రంలో గంపోనిగూడెం క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నిరుపేదల ఆరాధ్యుడు ఎన్టీఆర్ అని, తెలుగు జాతి ఔన్న త్యాన్ని, ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పిన మహానీయుడని కొనియాడా రు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడి, పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత ఎన్టీ ఆర్ దయాని అన్నారు.

సమాజమే దేవాల యం ప్రజలే దేవుళ్లు అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది, నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన, స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కర్త నందమూరి తారక రామారావు అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.